- Advertisement -

సర్దార్ సెట్ లో.. స్పెషల్ గెస్ట్

- Advertisement -

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బజ్ సర్దార్ గబ్బర్ సింగ్.. రోజుకో రకంగా వార్తల్లోకి ఎక్కుతోంది. త్వరలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా.. అప్పుడే ఫ్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు.. ఈ సినిమా షూటింగ్ సెట్స్ కు వస్తున్న స్పెషల్ గెస్ట్ ల సంఖ్య పెరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి.. సడన్ గా సర్దార్ షూటింగ్ సెట్ కు వెళ్లి.. తమ్ముడినీ, చిత్ర యూనిట్ ను పలకరించి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ గెస్ట్ కూడా.. సర్దార్ యూనిట్ ను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను సర్ ప్రైజ్ చేశారట. తనెవరో కాదనీ.. పవన్ అమ్మ అంజనీ దేవేనని తర్వాత మీడియాకు తెలిసింది.

ఆ టైమ్ కు షూటింగ్ లో ఉన్న పవన్.. షాట్ ఓకే అవగానే వెళ్లి అమ్మ అంజనీదేవితో మాట్లాడారట. ఇది చూసి చిత్ర యూనిట్ తో పాటు.. అక్కడున్నవాళ్లంతా ముచ్చటపడ్డారట. అంతే కదా.. ఫ్యాన్స్ కు పవర్ స్టార్ అయినా.. తన అమ్మకు పవన్ ముద్దుల కొడుకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -