Sunday, April 28, 2024
- Advertisement -

హర హర మహాదేవ.. శంభో శంకర

- Advertisement -

మహాశివరాత్రి పర్వదిన శోభతో.. దేశవ్యాప్తంగా శివాలయాలు ప్రత్యేక కళ సంతరించుకున్నాయి. లక్షలాదిగా భక్తజనం చేస్తున్న శివనామస్మరణతో ఆలయాలు.. మార్మోగిపోతున్నాయి.

మహా శివరాత్రి నాడు అర్థరాత్రి జాగారంతో కూడిన ఉపవాస దీక్ష చేస్తే మంచి జరుగుతుందని.. కోరిన కోరికలు నెరవేరుతాయని.. పరమశివుడి కటాక్షం కలుగుతుందన్న నమ్మకంతో.. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, విజయవాడ, వేములవాడ, కాళేశ్వరం, కొమురవెల్లిలాంటి శైవక్షేత్రాలతో పాటు.. యాదాద్రిలో కూడా అధికారులు భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

మహాశివరాత్రి పండగ విశిష్టతపై… పురాణాలు ఇలా విశదీకరిస్తున్నాయి. వైదిక కాలానికి చెందిన మహా పండగల్లో ఒకటి.. ఈ మహాశివరాత్రి. ప్రతి ఏటా మొత్తం ఐదు రకాలైన శివరాత్రులు జరుగుతాయి. అందులో.. నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి, యోగ శివరాత్రి ఉన్నాయి.

అయితే.. మార్గశిర మాసంలో.. బహుళ చతుర్దశి రోజు ఆర్ద్ర నక్షత్రంలో నడి అర్థరాత్రి సమయంలో శివుడి లింగోద్భవం జరిగిందనీ..శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజనీ పురాణాలు చెబుతున్నాయి. ముక్కంటికి అత్యంత ఇష్టమైన ఈ రోజున.. శివ లింగాన్ని ఆరాధించినా..

శివ కళ్యాణం చేసినా.. తన కుమారుడు కుమారస్వామికన్న శివుడికి ఆ భక్తుడు మరింత ప్రీతిపాత్రంగా మారతాడనీ పురాణాలు చెబుతున్నాయి. ఇది తెలుసుకున్న భక్త జనం.. అర్థనారీశ్వరుడి కరుణా కటాక్షాల కోసం.. ప్రత్యేక పూజలు, అభిషేకాలకు శివాలయాలకు తరలివెళ్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -