Friday, April 26, 2024
- Advertisement -

జాన్సన్ and జాన్సన్ పౌడర్ వాడితే యోని క్యాన్సర్?

- Advertisement -

జాన్సన్ అండ్ జాన్సన్…! ఈ పేరు వినగానే పసిపిల్లల చర్మానికి హాని కలగని సబ్బులు, పౌడర్లే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడా బ్రాండ్ ఉత్పత్తుల విశ్వసనీయతే ప్రశ్నార్థకమైంది. అమెరికాలోని బర్మింగ్ హమ్ చెందిన ఫాక్స్‌ అనే మహిళ.. 35 ఏళ్లుగా జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ నే వాడేవారు.

 

దీని కారణంగా ఆమె యోని సంబంధ క్యాన్సర్కు గురై.. మూడేళ్ల క్రితం మరణించారు. టాల్కం పౌడర్ లో ఉపయోగించే మినరల్ కెమికల్స్… ఫాక్స్ శరీరంపై  దుష్ఫలితాలు చూపడంతోనే ఆమె మృతి చెందిందని వైద్య పరీక్షల్లో తేలింది.  వైద్యుల ధ్రువీకరణ అనంతరం.. ఫాక్స్ బంధువులు.. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై కోర్టులో దావా వేశారు. 

కేసు విచారించిన మిస్సోరి జ్యూరీ బాధిత మహిళ కుటుంబానికి 72 మిలియన్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 468 కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. టాల్కం పౌడర్ వల్ల సంభవించే దుష్ఫలితాపై  వినియోగదారులను చైతన్య పరచాల్సిన బాధ్యత సదరు కంపెనీదే అంటూ తీర్పునిచ్చింది.

కోర్టు దెబ్బకు దిమ్మతిరిగిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ.. పెనాల్టీ మొత్తాన్ని తగ్గించాలంటూ అప్పీలు చేసింది. ఈ కేసు నేపథ్యంలోనే.. అటు న్యూజెర్సీలోనూ.. జాన్సన్ సంస్థ పౌడర్ లపై మరిన్ని కేసులు నమోదయ్యాయి. పౌడర్ దుష్పరిణామాల గురించి..

అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు 1200కు పైగా కేసులు నడుస్తున్నాయి. మన దేశంలోనూ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పౌడర్లు, సబ్బులను ఇబ్బడిముబ్బడిగా వాడుతున్నారు.

అమెరికన్ కేసు తర్వాత.. భారత్ లోనూ ఈ ఉత్పత్తులపై సందేహాలు మొదలయ్యాయి. మరి ఇక్కడి ఉత్పత్తుల గురించి సంస్థ ప్రతినిధుల స్పందన ఏంటో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -