ఈ ఫోటోలో మీరు చూస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? అదేనండి మన మహేశ్ బాబు మురారి సినిమాలో హీరోయిన్గా నటించిందే సోనాలి బింద్రే ఆమెదే మీరు ప్రస్తుతం చూస్తున్న ఫోటో.ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ సోనాలి బింద్రేకు తాజాగా క్యాన్సర్ సోకిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలికి క్యాన్సర్ అని తెలిసి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు వివిధ వర్గాల నుంచి ఆమెకు సానుభూతి వ్యక్తమైంది.
తనకు సపోర్టుగా నిలిచిన వారందరికీ సోనాలి కృతజ్ఞతలు కూడా తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్న సోనాలి బింద్రే తన లేటెస్ట్ ఫొటోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె జుట్టు మొత్తం కుంచుకుపోయింది. బుగ్గలు – ముఖం మొత్తం చిన్నగా మారిపోయింది. మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయిన వ్యక్తిలా కనిపిస్తున్నారు.క్యాన్సర్ ను ఎదుర్కొంటున్న ఈ హీరోయిన్ మనోదైర్యాన్ని సోషల్ మీడియాలో అందరూ పొగుడుతున్నారు.