Saturday, April 27, 2024
- Advertisement -

అమెరికా సెక్స్ రాకెట్‌పై కామెంట్స్ చేసిన యాంక‌ర్ శ్యామల..!

- Advertisement -

యాంక‌ర్ శ్యామలా బిగ్ బాస్ సీజన్ -2 నుండి నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్‌లోకి వెళ్ల‌క ముందు ఆమె ప‌లు టీవీ షోల‌కి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్యామల కూడా అమెరికాలో ఈవెంట్స్ కోసం వెళ్తుంటుంది. ఓ టీవీ చానెల్‌లో పాల్గొన్న శ్యామ‌లాకు అమెరికా సెక్స్ రాకెట్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సెక్స్ రాకెట్ కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా..? అని స‌ద‌రు యాంక‌ర్ శ్యామలాని ప్ర‌శ్నించింది.

దీనిపై శ్యామల చాలా కూల్ గా సమాధానాలు చెప్పుకొచ్చింది. ”నేను అమెరికా వెళ్లినప్పుడు అందరితో కలిసి హోటల్స్ లో ఉండడం కంటే మా చుట్టాల ఇళ్లల్లో ఎక్కువగా గడుపుతుంటాను. నేను ఫోన్ అసలు వాడ‌ను కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి కాల్స్ కూడా రాలేదు. నేను పాల్గొనే ఈవెంట్స్ అన్నీ కూడా పెద్ద ఆర్గనైజేషన్స్ కు సంబంధించినవి కావ‌డంతో నాకు అలాంటివి ఎదురుకాలేద‌ని చెప్పుకొచ్చింది. త‌న‌తో వ‌చ్చిన వాళ్ల గురించి త‌న‌కు తెలియ‌ద‌ని ఈ ప్ర‌శ్న‌ను వాళ్ల‌నే అడ‌గాల‌ని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -