తెలుగు సినిమాలు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమా తరువాత తెలుగు సినిమాలు గురించి అన్ని బాషల వారు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మరి అలాంటి సినిమా కన్నా తెలుగులో మరో సినిమా గురించి ఎక్కువుగా మాట్లాడుకున్నారు. ఆ సినిమానే అర్జున్ రెడ్డి. ఇండియా మొత్తం బాహుబలి సినిమా గురించి చర్చించుకుంటుంటే తెలుగు ప్రజలు మాత్రం అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాకుంటున్నారు. అంతలా ఈ సినిమాలో ఏం ఉందనే ప్రశ్న అందరిలోను ఉంది. సినిమా ట్రైలర్‌తోనే తన సినిమాలో ఏం ఉంటుందో చెప్పేశాడు చిత్ర దర్శకుడు. యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా లిప్ లాక్స్ ఉండటంతో సినిమాకు ప్రమోషన్స్ బాగానే వచ్చింది. నిజానికి అర్జున్ రెడ్డి సినిమా మొదటి షో చూసిన వారిలో నెగెటివ్ కామెంట్స్ చేసిన వారే ఎక్కువ. కానీ మెల్లమెల్లగా ఈ సినిమా పుంజుకోవడానికి కారణం సినిమాలో రొమాన్స్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. సన్నివేశాలు రియలిస్టిక్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకాదరణ లభించింది.
ఇక ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా కూడా ఇదే కోవలోకి చెందుతుంది. సినిమాలో రొమాన్స్ గాఢత ఎక్కువగా ఉండడంతో యూత్ ఈ సినిమాపై మక్కువ చూపుతున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా బోల్డ్, రొమాంటిక్ సీన్స్ లో నటించడం యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది.దీంతో అందరు తెలుగు సినిమాలకు ఏమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు.మన హీరోయిన్లు ఏ బెలూన్ కో మరో వస్తువుకో ముద్దు పెడితే దాన్ని హీరోకి పెట్టినట్లు తమ గ్రాఫిక్ వర్క్ తో మ్యాజిక్ చేస్తుంటారు. కాని ఈ మధ్య తెలుగులో వచ్చే ప్రతి సినిమాలో లిప్ కిస్‌లు కామన్‌గా మారిపోయాయి.మొత్తానికి టాలీవుడ్ సినిమాలు కూడా బాలీవుడ్, హాలీవుడ్ రొమాంటిక్ సీన్స్ కు ఏమాత్రం తీసిపోవని నిరూపిస్తున్నాయి.
