Tuesday, April 23, 2024
- Advertisement -

వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్‌

- Advertisement -

మెగా హీరో వ‌రుణ్ తేజ్ వ‌రస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ సినిమాల‌తో హిట్ కొట్టాడు వ‌రుణ్‌. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌2, ఘాజీ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌లు. ఈ మూవీని డిసెంబర్‌ 21న రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఘాజీ సినిమాను సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సంకల్ప్‌, తన రెండో సినిమాను అంతరిక్ష నేపథ్యంలో అత్యద్భుతంగా, హాలివుడ్‌ టెక్నిషియన్స్‌తో విజువల్‌ వండర్‌గా తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సంకల్ప్‌ రెడ్డి. సినిమాలో హీరోయిన్లుగా అదితి రావు, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -