Tuesday, May 14, 2024
- Advertisement -

పీకే టీంతో జ‌గ‌న్‌కు లాభామా..? న‌ష్ట‌మా..?

- Advertisement -

2019లో జ‌రిగే ఎలెక్ష‌న్స్‌లో ఎట్టి పరిస్థితుల‌లో సీఎం కావాల‌నే ఆశ‌తో ఎండ వాన లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల‌లలో తిరుగుతున్నాడు వైఎస్ జ‌గ‌న్‌. జగన్ పాదయాత్రకు ప్రజల ఆదరణ కూడా అలాగే ఉంది. ప్రజాసంకల్పయాత్ర చారిత్రాత్మకం అయ్యే దిశగా సాగుతూ ఉంది. పాదయాత్రతో జగన్ ప్రజలకు మరింతగా కనెక్ట్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల‌లో మితిమిరిన ఆశ‌తో విజ‌యాన్ని తృటిలో చేజార్చుకుంది వైసీపీ. ఈసారి అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నే జ‌గ‌న్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే జ‌గ‌న్ సోష‌ల్ మీడియా కింగ్ అయిన ప్ర‌శాంత్ కిషోర్‌ని త‌న పార్టీ త‌రుపున సోష‌ల్ మీడియా క‌న్విన‌ర్‌గా నియ‌మించారు.

ప్ర‌జ‌ల‌లో పార్టీపై ఉన్న అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌జేసే పనిని ప్ర‌శాంత్ కిషోర్‌కి అప్ప‌జెప్పాడు జ‌గ‌న్. అయితే ఈ టీం వ‌ల్ల వైసీపీకి ఎటువంటి లాభం లేద‌ని తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్‌ని నియ‌మించి సంవ‌త్స‌రం దాటిన ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీపై పట్టు సాధించ‌లేద‌ని సమాచారం. ఢీల్లీ, బిహార్‌ల‌లో ప్ర‌జ‌ల‌ను అంచ‌నా వేయడంలో పీకే టీం స‌ఫ‌లం చెందింది. అయితే అక్క‌డ వాత‌వ‌ర‌ణం ,ఇక్క‌డ వాత‌వ‌ర‌ణం వేరుగా ఉంటుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేషుకులు. అలాంటి వ్యూహాలు ఇక్క‌డ ప‌నికి రావ‌ని,ఇక్క‌డ చదువుకున్న వారిక‌న్నా చ‌దువుకోని వారే ఎక్కువ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు ర‌చించాలి కాని ట్విట్ట‌ర్, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌ను ఏపీలో పెద్ద‌గా ఎవ‌రు ప‌ట్టించుకోర‌న్న సంగ‌తి పీకే టీం ఇప్ప‌టికైనా గ్ర‌హించిందో లేదో. ఏపీలో ఎలెక్ష‌న్స్ ఎప్పుడూ జ‌రిగిన డ‌బ్బు, కుల స‌మీక‌ర‌ణ‌ల‌తో జ‌రుగుతుంటాయాని పీకే టీం ఇప్ప‌టికైనా తెలుసుకుందో లేదో మ‌రి.

ఇప్పుడున్నా పరిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే వైసీపీకి కొంత అనుకూలంగానే ఉంద‌ని చెప్పాలి. ఈ వేవ్ ను చంద్రబాబు మార్చేయగలడని ఈ మధ్యనే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. చంద్ర‌బాబుకి పోల్ మేనెజ్‌మెంట్ బాగా తెలుసున‌ని ,ఆయ‌న ముందు పీకే టీం ఎందుకు పనికి రాద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. అస‌లు పీకే టీం ఇప్ప‌టి వ‌ర‌కు ఏం సాధించిందో ఎవ‌రికి తెలియ‌దు. ఇక టీడీపీ ఇప్ప‌టికే వైసీపీ అనుకుల సోష‌ల్ మీడియాపై దాడులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీకి వ్య‌తిరేకంగా వార్త‌లు రాసిన‌,యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టిన వారిని టార్గెట్ చేసుకుని దాడుల‌కు దిగుతున్నారు. ఈ విష‌యాన్ని వైసీపీ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ అయిన ప్ర‌శాంత్ కిషోర్‌కు తెలియ‌జేస్తే ఆయ‌న నుండి పెద్ద‌గా స్పంద‌న రాలేద‌ని స‌మాచారం.

దీంతో చేసేది లేక చాలామంది వైసీపీ అభిమాన సోష‌ల్ మీడియా వారు టీడీపీకి అనుకులంగా మారుతున్నారు. అస‌లు వైసీపీకి ప్రత్యేక సోష‌ల్ మీడియా టీం అవ‌స‌రం లేదు. ఎందుకంటే వైసీపీకి స్వ‌చ్ఛందంగా సోష‌ల్ మీడియాలో అభిమానులు ఉన్నారు. వారు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ ఏం చేస్తున్నాడ‌నే విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు పీకే టీం వైసీపీ నాయ‌కుల‌తో క‌నెక్ట్ కాలేదు. దీని బట్టి చూస్తే పీకే టీం వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. మ‌రి జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిషోర్‌ని న‌మ్ముకుని వ‌చ్చే ఎలెక్ష‌న్స్‌కు వెళ్తే దెబ్బ తిన‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -