హీరో రాజ్ తరుణ్ గత కొంతకాలంగా సరైనా హిట్లు లేక సరైన హిట్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు.కుమారి 21 ఎఫ్ తరువాత మనోడికి హిట్ లేదు.వీడోరకం అడోరకం సినిమా హిట్ అయినప్పటికి అది కాస్తా మంచు విష్ణు ఖాతాలోకి వెళ్లిపోయింది. రాజ్ తరుణ్ నటించిన కొన్ని సినిమాలు అయితే విడుదులైన నెల రోజులకే టీవీలలో కూడా దర్శనం ఇచ్చేశాయి.దీంతో ఎలాగైన హిట్ కొట్టలనే కసితో ‘లవర్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
తాజాగా విడుదలైన లవర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రాజ్ తరుణ్‌కు జోడిగా రిధి కుమార్ నటించింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలతో రాజ్‌తరుణ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాకు అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.