Tuesday, May 14, 2024
- Advertisement -

కడప దెబ్బ అదిరింది……… లోకేష్‌కి దిమ్మ తిరిగింది

- Advertisement -

నారా వారికి కడప అంటే ఉన్న భయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్‌లపై ఉన్న భయం కాస్తా కడప అంటేనే భయపడే స్థాయికి వచ్చారు. ఇక వైఎస్‌లను అభిమానించే కడప ప్రజలన్నా, మరీ ముఖ్యంగా పులివెందుల ప్రజలంటే చంద్రబాబుకు ఎంత ద్వేషమో ఆయన మాటల్లోనే చాలా సార్లు విన్నాం. ఒక్కోసారి మొత్తం రాయలసీమ ప్రజలంతా గూండాలు, రౌడీలు అని మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది. ఇక ఇప్పుడు తాజాగా నారా లోకేష్ కూడా కడప ప్రజలు ఎలా ఉంటారో అర్థమైంది.

తాజాగా కడపలో పర్యటించిన నారా లోకేష్ 2019 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నియోజకవర్గంలో టిడిపి గెలవాలని, వైఎస్‌ల సొంత గడ్డపై విజయం సాధించాలని ప్రగల్భాలు పలికాడు. అలాగే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గీయులు కలిసి పనిచేసి టిడిపిని గెలిపించాలని సూక్తులు చెప్పబోయాడు. అయితే రామసుబ్బారెడ్డి వర్గీయుడైన ఒక వ్యక్తి లోకేష్ మాటలకు అడ్డుపడ్డాడు. చెప్పింది చాలు….. ఇంగ మేం మాట్లాడేది ఇనండి’ అని లోకేష్‌ని నిలదీశాడు. మీ నాయనపైన నక్సల్ ఎటాక్‌కి సాయం చేశాడని గంగిరెడ్డిని మలేషియా నుంచి తెప్పించారు. మరి మాకు ఆ సూత్రం వర్తించదా అని ఆ వ్యక్తి లోకేష్‌ని గట్టిగా అడిగాడు. నిన్నటిదాకా ఆదినారాయణరెడ్డి వర్గీయులు మా మనుషులపై దాడులు చేశారు, చంపేశారు. ఇంకా కోర్టు కేసులు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మరి అలాంటి శతృవులు అయిన ఆదినారాయణరెడ్డి, ఆయన మనుషులతో మమ్మల్ని కలిసి పనిచేయమంటే ఎలా చేయాలి సార్. మాకు ఒక నీతి……….మీకు ఇంకో నీతా’ అని లోకేష్‌ని నిలదీశాడు రామసుబ్బారెడ్డి వర్గీయుడు.

ఆ దెబ్బతో లోకేష్‌కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అర్థాంతరంగా తన ప్రసంగాన్ని ముగించి వడివడిగా అక్కడి నుంచి జంప్ అయ్యాడు లోకేష్. అన్ని చోట్లా మాట్లాడినట్టే కడపలో కూడా మాట్లాడతానంటే ఎలా కుదురుద్ది అని సభా ప్రాంగణంలోనే ఉన్న టిడిపి నాయకులే మాట్లాడుకోవడం కనిపించింది. ఇప్పటికే కర్నూలులో మాట్లాడిన మాటలతో టిడిపిలో మంటలు పుట్టించిన లోకేష్, ఇప్పుడు కడపలో కూడా రచ్చ రాజేశాడు. ఇక ఈ యువ నాయకుడు రాష్ట్రమంతా పర్యటిస్తే మాత్రం కచ్చితంగా టిడిపిపైన భారీ దెబ్బ పడడం ఖాయం అని టిడిపి నాయకులే ఆందోళన చెందుతుండడం మాత్రం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -