హీరోయిన్ స్వాతి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. తాజాగా ఓ ప్రముఖ పత్రిక స్వాతిని ఇంటర్వ్యూ చేసింది ఇందులో తెలుగు పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నడుస్తున్న వివాదాలపై స్వాతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘కష్టాలనేవి ఇంట్లో కూడా ఉంటాయి. మరి పనిచేసే ప్రాంతాల్లో ఉండవా? క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో ఎవరూ డైరెక్టుగా మాట్లాడరు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు’’ అని స్వాతి తెలిపింది. నా వరకు అయితే ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని తెలిపింది.
కలర్స్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచియమైంది స్వాతి. తరువాత సినిమాలలో అవకాశాలు తెచ్చుకుంది. స్వాతి తెలుగులో హీరోయిన్గా స్థిరపడలేకపోయినా.. తమిళం, మలయాళం సినిమాల్లో మంచి అవకాశాలనే అందుకుంటోంది . స్వాతి హీరోయిన్గా చేసిన తొలి చిత్రం కూడా తమిళ చిత్రమే కావడం గమనార్హం. ఆమెకు తెలుగు సినిమాలు లేకపోయినప్పటికి తమిళ,మాళయాళ భాషలలో వరస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.