Tuesday, May 14, 2024
- Advertisement -

అది అస‌లు నోరేనా అంటు తేజ‌స్వీపై నాని ఫైర్‌

- Advertisement -

శ‌నివారం వ‌చ్చింది బిగ్‌బాస్‌లోకి నాని వచ్చాడు. వ‌చ్చి రావ‌డంతోనే హోస్‌మెట్స్‌పై విరుచుప‌డ్డాడు నాని. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ రెండో నెల‌లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈవారం నాని ఓ స్పెష‌ల్ చైర్ తెచ్చుకున్నాడు. ఈ చైర్‌లో విల‌న్‌గా కుర్చొని హౌస్‌మేట్స్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా తేజస్వీ, భాను, అమిత్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి – చెడు టాస్కులో తేజస్వీ, భానులు చేసిన హంగామాపై నాని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్ర‌తివారంలాగే తేజస్వీకి ఈసారి కూడా చివాట్లు తప్పలేదు. మంచి – చెడు టాస్కులో భానుకి కౌశ‌ల్ చెయ్యి త‌గిలింద‌ని తేజస్వీ వీరంగం సృష్టించింది.ఈ వ్య‌వ‌హారంలోకి గీత మాధురి వ‌చ్చి కౌశ‌ల్‌ను తప్పుప‌ట్ట‌కూడ‌ద‌ని చెప్పింది. దీంతో నీకు త‌గిలితే అప్పుడు తెలుస్తుంద‌ని,అయిన నువ్వు భాను శ్రీని ట‌చ్ చేయ‌డం చూశావా అని గీత‌ని ప్ర‌శ్నించింది తేజ‌స్వీ.

భాను శ్రీపై కౌశిల్ చెయ్యి వేయడం నువ్వు చూశావా అని తేజ‌స్వీని ఎదురు ప్ర‌శ్నించాడు నాని. అది నోరేనా అస‌లు ఓరేయ్ సిగ్గులేదా,అక్క‌డ పెట్టుకో,మూసుకో,వాడి క్యారెక్ట‌ర్ అదే, ఇలాంటి మాటాలు ఎవ‌రైనా మాట్లాడ‌తారా అని తేజ‌స్వీకి క్లాస్ పీకాడు. నువ్వు షోలో మంచిగానే ఉంటున్నట్లు న‌టిస్తున్నావ‌ని, కాని బ‌య‌ట చూసే జ‌నాల‌కు విల‌న్‌గా క‌నిపిస్తున్న‌వ‌ని హెచ్చ‌రించాడు. ఇక ఈ వారం ఎలిమినేష‌న్స్‌లో ఉన్న ముగ్గురు(దీప్తి,గ‌ణేష్,భాను శ్రీ) ఎవ‌రు బ‌యటికి వ‌స్తారో ఈరోజు(ఆదివారం) తెలియ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -