దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కిస్తున్న ‘ఆటగదరా శివ’ సినిమాలోని ఓ పాటను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేత విడుదల చేయించారు. వైవిధ్య కథా నేపథ్యాలతో సినిమాలు తెరకెక్కించే చంద్ర సిద్ధార్థ ఉరిశిక్ష నేపథ్యంలో మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉరిశిక్ష పడిన ఖైదీ జైలు నుంచి తప్పించుకొని వస్తూ.. తనను ఉరి తీయడానికి వస్తున్న తలారి జీపులోనే ఎక్కుతాడు.
ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? వారు ఎదుర్కొన్న అనుభవాలేంటి? చివరకు ఏమైంది? అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో అందరు కొత్త నటీనటులే యాక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.