బిగ్‌బాస్ రెండో సీజన్‌లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధం అయింది. ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారో అని అందరిలోను ఉత్కంఠ నెలకొంది. బిగ్‌బాస్ రెండో సీజన్‌కు న్యాచురల్ స్టార్ నాని వాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నాని తనదైన స్టైల్లో షోని రక్తికట్టిస్తున్నాడు. ఇక షోలోని హోస్‌మెట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. హోస్‌మెట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం చూస్తుంటే.. వీరి కన్నా చిన్న పిల్లలే నయంగా కనిపిస్తున్నారు. ఇక ఈ వారంలో ముగ్గురు ఎలిమినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీప్తి,గణేష్,భాను శ్రీ ,ఈ ముగ్గురు ఎలిమినేషన్స్‌కి ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. ఈ ముగ్గురులో ఎవరు ఉంటారో? ఎవరు వెళ్తారో ఓ సారి చూద్దాం.
షోకి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన గణేశ్ మొదటి నుండి షోలో డల్‌గా ముభావంగా ఉంటు వస్తున్నాడు. ఎవరు ఏ పని చెప్పిన చేస్తు అందరికి భంటులా మారాడు. ప్రతి వారం గణేశ్‌ని ఎవరో ఒకరు నామినేట్ చేస్తే ఎలిమినేషన్‌లో ఉంటు వస్తున్నాడు. కాని ఈ వారం తనకు తానే ఎలిమినేట్ చేసుకుని ఎలిమినేషన్‌లో ఉన్నాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు నాని. ఇతనికి బయటి నుండి పెద్దగా మద్దతు లభించదని అందరు అనుకుంటున్నప్పటికి ..గణేశ్‌కు బాగానే ఓట్లు వస్తుండటంతో ఇతను షోలో ఉండేలా కనిపిస్తున్నాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న మరో వ్యక్తి దీప్తి. గత వారం ఎలిమినేషన్ నుండి తృటిలో బయటపడింది దీప్తి. ఓ ప్రముఖ చానెల్ న్యూస్ యాంకర్‌గా బయట ప్రపంచనికిబాగానే తెలుసు కాబట్టి ఆమెకు ఓట్లు బాగానే వచ్చే అవకాశం ఉంది. ఒక ఈ వారం ఎలిమినేషన్‌లో మిగిలింది భాను శ్రీ. ఈమె బిగ్‌బాస్ షోకి రాకముందు ఎవరికి పెద్దగా తెలియదు.
కాని షో మొదటి వారంలో తన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంది. కాని ఈ వారం ఎలిమినేషన్‌లో ఉండటంతో తనలోని మరో మనిషి బయటికి వచ్చింది. కౌశల్‌తో గొడవ పడిన విధానం,అతనని అసభ్య పదజాలం వాడటం వంటి చర్యలతో తనకు తానే ఈ వారం విలన్‌గా మారింది. షో చూసే బయటి జనాలకు ఆమెకు ఎందుకు ఓటు వేయలనే అని ఆలోచిస్తున్నారు. దీంతో అందరి కళ్లు ఈ వారం బిగ్‌బాస్ ఇంటి నుండి భానునే వెళ్లిపోతుందని అందరు భావిస్తున్నారు.
