వాసు వర్మ దర్శకత్వంలో రూపొందిన కృష్ణాష్టమి చిత్రంతో పెద్ద మొత్తంలో ఘన విజయం సొంతం చేసుకుందాం అని ఈ సినిమాపై బోలేడు ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. వరస ఫ్లాఫ్ లు సునీల్‍ని కలవరపెడతున్నాయి. కృష్ణాష్టమి సినిమాకి ఓపినింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి.
మార్కేట్‍లో సునీల్‍కి మంచి క్రేజ్ ఉన్న సరైన సినిమా పడక భాక్సాఫీస్ వద్ద అతని సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. కృష్ణాష్టమిలో పెద్దగా కామెడీ పండలేదు. అందుకే ఈ సారి తన తదుపరి చిత్రం జక్కన్న లో కామెడీ డోస్ పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిస్తోంది.
ఆకెళ్ల వంశీ కృష్ణ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అందాల రాముడు వంటి హిట్ సినిమాతో కమిడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ కు ఆ తర్వాత మర్యాద రామన్న పెద్ద బ్రేక్ ఇచ్చింది. తర్వాత వచ్చిన పూల రంగడు, తడాఖా చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సినిమా ఏదీ ఆడలేదు.
