Saturday, May 25, 2024
- Advertisement -

వాటేసుకోవడమే కాదు… పాటేసుకుంటున్నారు కూడా…

- Advertisement -

సౌత్లో మ్యూజిక్ డైరెక్టర్లంతా ఒకటైపోయారు.ఏదో చేశాం ,కలిసాం అని కాకుండా…. కలిసి పని చేయడానికి ఆసక్తి  చూపుతున్నారు.రెహమాన్ శిష్యుల నుంచి మణిశర్మ శిష్యుల వరకు అందరూ… ఇలా చేస్తూ  మన్ననలు పొందుతున్నవారే.

సినిమా ఇండస్ట్రీలో ఒక చిత్రం హిట్ కావాలంటే ఆ చిత్రానికి కథతో పాటు సంగీతం కూడా తోడవ్వాలి. కొన్ని సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా కేవలం మ్యూజికల్ గా హిట్ అందుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దేవీశ్రీ ప్రసాద్, అనూప్ రుబిన్,మిక్కి జె.మేయర్,థమన్,యువన్ శంకర్ రాజ్, సాయి కార్తీక్ లాంటి యువ సంగీత దర్శకుల హవా కొనసాగుతుంది.

అయితే ఈ సంగీత దర్శకుల మద్య ఎలాంటి పోటీ తత్వం లేకుండా కూల్ గా సాగిపోతుంది. కొన్ని ఆడియో ఫంక్షన్లలో ఈ సంగీత దర్శకులు పక్క మ్యూజిక్ డైరెక్టర్లను విపరీతంగా పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి.అంతెందుకు ఐ సినిమా కు రెహమాన్ మ్యూజిక్ డైరెక్టరే అయినా…మరో మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి అనిరుద్… మెర్సలైట్ అంటూ పాడేశాడు.

అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన  ‘అఖిల్’ చిత్రం కోసం తమన్, అనూప్ కలిసి పని చేశారు.తాజాగా  థమన్, మిక్కీ జే. మేయర్ ఒక సినిమా కోసం కలిసి పనిచేయడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్న సందీప్ కిషన్ చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రానికి థమన్ చేత పాట పాడించారు.

ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమాకు కలిసి పని చేయడానికి మన  మ్యూజిక్ డైరెక్టర్లకు ఎలాంటి ఇగోలు అడ్డు రావడం లేదు.థమన్ లాంటివారు అందరితో కలిసిపోతోన్నారు.మ్యూజీషియన్స్ అందరితో సరదాగా ఉండే దేవి శ్రీ ప్రసాద్ శ్రీరామ్ దాసు చిత్రంలో కీరవాణితో కలిసి ఓ లెస్సా అంటూ  ఓ పాటేసుకున్నాడు.

మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా కలిసి పని చేయడం వెనుక ముందుగా మనకు కీరవాణి వేసిన స్టెప్పే కనిపిస్తుంది. మర్యాద రామన్న చిత్రంలో రఘుకుంచె తో కూడా కీరవాణి పాట పాడించుకోవడం విశేషం.మణిశర్మ సైతం ఇప్పటి తరం  మ్యూజిక్ డైరెక్టలతో కలిసి పని చేస్తూనే ఉన్నాడు.తాను పని చేస్తోన్న వారంతా ఒకప్పుడు తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసినవారే.అయినప్పటికీ… ఇగోలు లేకుండా పని చేసుకుంటూ పోవడం మంచి హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందనుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -