Friday, May 17, 2024
- Advertisement -

ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్‌కు వేధింపులు

- Advertisement -

ప్ర‌ముఖ టీవిలో ప‌నిచేస్తున్న తెలుగు యాంక‌ర్‌ను వేధించిన కేసులో ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే .. విజ‌య‌వాడ న‌గ‌రంలో ఓ టీవి చానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న యువతిని గ‌త కొంత‌కాలంగా వేధిస్తున్నారు.త‌ర‌చు ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. వీరి వేధింపులు ఎక్కువ అవ్వ‌డంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఉపయోగించిన ఫోన్‌ నెంబర్‌ల ఆధారంగా వారి వివరాలు తెలుసుకున్నారు.

నెల్లూరుకు చెందిన పరుచూరి పెద్దబాబు, పరుచూరి చిన్నబాబు ఇద్దరు అన్నదమ్ములు. వీరు గతంలోనూ ఇదే తరహాలో అనేక మంది మహిళలతో ఇలాగే వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలినట్లు సమాచారం. వారు సీరియల్‌గా కొన్ని ఫోన్‌ నెంబర్‌లను వరుసగా డయల్‌ చేస్తారు. ఎవరైనా ఆడవారు మాట్లాడితే చాలు వారు తమ బుద్ధిని బయటపెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బయటకు చెప్పుకునేందుకు వీలులేని విధంగా తమ మాటలతో వేధింపులకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -