- Advertisement -

మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి కారణం ఇదే?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి టీజర్‌ రిలీజ్‌ అయ్యి యూట్యూబ్‍లో హల్ చల్ చేస్తుంది. ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌లో ఫాన్స్‌ సందడి చేస్తున్నారు. టీజర్ అద్భుతంగా ఉందని, కేక అని, రచ్చ, తురుమ్‌ అంటూ ఫ్యాన్స్ తమకి అనందన్ని తెలుపుతున్నారు. సాధారణంగా ఇలా పెద్ద హీరో సినిమాకి సంబంధించి టీజర్ కాని సాంగ్స్ కానీ వస్తే మిగిలిన హీరోల అభిమానులు సైలెంట్‌గా చూస్తుంటారు.

ఆ రచ్చ తగ్గే వరకు ఒక విధమైన నిశ్శబ్ధం పాటిస్తూ అవతలి ఫాన్స్‌కి పండగ చేసుకునే అవకాశం ఇస్తుంటారు. అలాగే మహేష్ అభిమానులు కూడా ‘సర్దార్‌’ హంగామాని సైలెంట్‌గా వాచ్‌ చేస్తోన్న సమయంలో సడన్‌గా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చి షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పి అలాగే సినిమాకి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ వదిలాడు మహేష్‌బాబు.

ఇలా మహేష్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ అభిమానులు బ్రహ్మోత్సవం సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ విడుదలయిన కొద్ది రోజుల్లోనే బ్రహ్మోత్సవం పాటలు రాబోతున్నాయి. శ్రీకాంత్ అడ్దాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణతీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -