Wednesday, May 22, 2024
- Advertisement -

పవన్ సర్దార్ ప్లానింగ్ ఇదే!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కావడానికి సరిగ్గా 20 రోజులు మాత్రమే ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించి షుటింగ్ పనులు మాత్రం ఇంక పూర్తి కాలేదు.  టాకీ పార్ట్ అయితే అవగొట్టేశారు కానీ.. ఇంకా మూడు పాటల చిత్రీకరణ మిగిలి ఉందని అంటున్నారు. అలాగే మరో వైపు  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉండనే ఉంది.

సో మరి ఈ 20 రోజుల్లో అన్ని పనులూ కాంప్లీట్ చేసి అనుకున్న సమయంలో సినిమాని రిలీజ్ చేస్తారు అనే విషయం పై సందేహాలు వస్తున్నాయి. ఐతే అన్ని పనులు చక చక జరుగుతున్నాయి ఖచ్చితంగా అనుకున్న సమయన్నికి సినిమా రిలీజ్ ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్‍ను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్‍కల్లా ఈ పాట షూటింగ్ కాంప్లీట్ చేయనున్నారు. ఆడియో వేడుక పూర్తి కాగానే సర్దార్ టీం యూరప్ బయల్దేరుతుంది.

అక్కడ వారం రోజుల్లో మిగతా రెండు పాటల్ని పూర్తి చేసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత మిగిలిన పది రోజుల్లో పవన్ డబ్బింగ్ పెట్టుకుంటారు. ఆలోపే మిగతా నటీనటుల డబ్బింగ్.. అసిస్టెంట్ డైరెక్టర్లు పూర్తి చేయిస్తారు. సో ఈ విధంగా సర్దార్ టీం ప్లాన్ చేస్తుంది. ఇలా ప్రణాళిక ప్రకారం జరిగితే అనుకున్న సమయం కల్లా సినిమా రిలీజ్ అవుతుంది అనడంలో సందేహాం లేదు. కానీ ఎదైన తేడా వస్తేనే రిలీజ్‍కు కష్టం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -