Monday, May 20, 2024
- Advertisement -

జక్కన్న ఫస్ట్ లుక్ అదిరింది

- Advertisement -

జక్కన్న అనగానే వెంటనే గుర్తొచ్చేది ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఇదే పేరు మీద తన సినిమాకు టైటిల్ గా పెట్టేసుకుని రంగంలోకి దిగుతున్నాడు సునీల్. సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం ‘జక్కన్న’.

వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సునీల్ మాట్లాడుతూ మంచి ఎనర్జిటిక్ మాస్ ఎంటర్ టైనర్. మర్యాదరామన్న తర్వాత రాంప్రసాద్ గారితో చేస్తున్న సినిమా. రక్ష డైరెక్టర్ వంశీ అకెళ్ళ రాంగోపాల్ వర్మగారి నుండి బాగా చేశావని మెచ్చుకున్నారు. ఎవరూ టచ్ చేయని పాయింట్ తో వస్తున్నామని చెబుతున్నాను.

ఇక కథ విషయానికి వస్తే రాళ్ళను శిల్పాలుగా చెక్కిన జక్కన ఎంతో కీర్తి గడించారు. అలాగే ఈ సినిమాలో నేనెందుకు పనికిరానని అనుకున్న వ్యక్తులకు నేను గొప్ప పనులు చేసి చూపడమే కాన్సెప్ట్” అన్నారు. దర్శకుడు వంశీకృష్ణ అకెళ్ల మాట్లాడుతూ ”నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతగారికి థాంక్స్. సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24 నుండి చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాం ” అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -