Thursday, May 8, 2025
- Advertisement -

ఆ హీరోతో సీక్రెట్‌గా వెళ్లి పోయిన హీరోయిన్‌

- Advertisement -

బాలీవుడ్ హీరో, హీరోయిన్లు ల‌వ్‌లో ఉండ‌టం,బ్రేక‌ప్ చెప్ప‌డం సర్వసాధార‌ణం.అయితే ట్రెండ్ మారింది.బాలీవుడ్ హీరోయిన్లంద‌రు పెళ్లిపై మోజు ప‌డినట్లున్నారు.ఇక ఇప్ప‌టికే పెళ్లి చేసుకున్నారు అనుష్క శర్మ, సోనమ్ కపూర్లు.తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో మిగిలింది దీపికా పదుకొణె మాత్ర‌మే.ఆమె పెళ్లిపై కూడా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి దీనిపై స్పందించ‌లేదు.దీపికా హీరో ర‌ణ్‌వీర్‌తో ప్రేమ‌లోఉంద‌ని అంద‌రికి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

వ‌చ్చే డిసెంబ‌ర్‌లో వీరు పెళ్లి చేసుకుంటార‌ని స‌మాచారం.తాజ‌గా వీరిద్ద‌రు క‌లిసి సీక్రెట్ టూర్ ప్లాన్ చేసుకున్నార‌ని తెలుస్తుంది.సినిమాల నుంచి కొంచెం బ్రేక్ లభించడంతో ఇప్పుడు ఈ ప్రేమ జంట విదేశాల్లో విహరిస్తోంది. ఇండియాలో అయితే ఇబ్బందిగా ఉంటుందని భావించి ఫారెన్ ట్రిప్‌ వేసుకున్నారు ఈ జంట‌. అక్కడ కూడా ఓ అభిమాని ఈ జోడిని గుర్తు పట్టి వీడియో తీశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -