Monday, May 13, 2024
- Advertisement -

వైసీపీ నుంచి టీడీపీలోకి వెల్లిన నాయ‌కులు మళ్లీ సొంత గూటికి

- Advertisement -

రాష్ట్రంలో వైసీపీని నిర్వీర్యం చేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అప‌రేష‌న్ ఆక‌ర్శ్ ప్రారంభించారు. 2019 ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ పార్టీలో ఉన్న ముఖ్మైన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకోవాల‌ని ఫిరాయింపుల‌కు తెర‌లేపారు. బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్స్ కొంత వ‌ర‌కు ఫ‌లించింది. వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌తోపాటు ముఖ్య‌నేత‌లు పార్టీ ఫిరాయించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బాబు అప‌రేష‌న్ ఆక‌ర్శ్ విక‌టించే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. పార్టీలోకి ఫిరాయించిన నేత‌ల‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇప్పుడు సొంత‌గూటివైపు చూస్తున్నారు.

అనంత‌పురంజిల్లా ఫిరాయింపు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి  మ‌ల్లీ సొంత‌పార్టీలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌. ఇదే విష‌యంపై అనంత‌పురం జిల్లాలో చ‌ర్చ కొన‌సాగుతోంది. గ‌తంలో వైసీపీనేత అయిన గుర్నాథ్‌రెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన సంగ‌తి తెల‌సిందే.

టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీలో ఉంటే లాభం చేకూరుతుందని ఆయన పార్టీ మారారు. అయితే.. ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. అధికార పార్టీలో ఆయనకు ఆశించిన ఫలితం లభించలేదనే వాదనలు వినపడుతున్నాయి. దీంతో వైసీపీలోకి వ‌చ్చేందుకు వైసీపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. కాగా.. ఈ విషయం చంద్రబాబు దాకా వెళ్లింది.

చంద్రబాబు.. తనకుమారుడు, మంత్రి లోకేష్ ద్వారా గుర్నాథరెడ్డితో సంప్రదింపులు జరిపారు. ఇటీవల లోకేష్ తో గుర్నాథరెడ్డి సమావేశమయ్యారు. పార్టీ మారే విషయంపై దాదాపు అరగంటపాటు చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌ను గుర్నాథరెడ్డి కలిసి చర్చించడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ మారే విషయంపై లోకేష్ బుజ్జగింపులు జరిపినట్లు వాదనలు వినపడుతున్నాయి. సంప్ర‌దింపులపై గుర్నాధ్‌రెడ్డి అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. మరి ఈ బుజ్జగింపులు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -