స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.
భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇటీవలే ప్రధాన పాత్రధారులు పాల్గొనగా పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు 50శాతం మేర షూటింగ్ పూర్తయింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడనేది తాజా సమాచారం. రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డిగా బన్నీ అద్భుతమైన పాత్రను పోషించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరహా పాత్రనే ఆయన ఈ సినిమాలోను చేయనున్నాడని అంటున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. ఒకవేళ అల్లు అర్జున్ చేయడం నిజమే అయితే .. అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
