- Advertisement -

రెండో టెస్ట్‌లో అండ‌ర్స‌న్ ధాటికి 107 ల‌కే చేతులెత్తేసిన టీమిండియా…

- Advertisement -

ఇంగ్లాండ్‌ గడ్డ మీద టెస్టుల్లో భారత బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ అండర్సన్ చెలరేగడంతో టీమిండియా 107 పరుగులకే ఆలౌటయ్యింది.

ఎడ్జ్ బాస్టన్ లో కొంచెం గౌరవప్రదంగా పోరాడి ఓడిన టీం ఇండియా లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో చేతులెత్తేసింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో కేవలం 35.2 ఓవర్లేకే 107 పరుగులకు అన్ని వికెట్లను సమర్పించుకుంది. జట్టులో టెయిలెండర్ అశ్విన్(28; 4×4) టాప్ సోర్కర్ గా నిలిచాడంటే భారత బ్యాట్స్ మెన్ ఎంత దారుణంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు.

వర్షం పడటం, వాతావరణం పిచ్ లపై ఉన్న తేమతో ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోయారు. అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికే మురళీ విజయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక భారత్ వికెట్ల పతనం ప్రారంభమయింది. విజయ్ ను ఔట్ చేసిన అండర్సన్ మరో చక్కటి డెలివరీతో కేఎల్ రాహుల్(8)ను పెవిలియన్ కు పంపాడు. దీంతో 11 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం వర్షం ఫడటంతో ఆట ఆగిపోయింది. మధ్యాహ్నం ఆట మళ్లీ మొదలుగాకాగా, కోహ్లితో సమన్వయం కొరవడటంతో పుజారా రనౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది.

అండర్సన్ 13.2 ఓవర్లలో 20 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీయగా.. కర్రాన్, బ్రాడ్‌‌ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన అండర్సన్‌.. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఇమ్రాన్ ఖాన్ (94) పేరిట ఉండగా.. 95 వికెట్లతో అండర్సన్ దాన్ని అధిగమించాడు.

ఆ తర్వాత కెప్టెన్ కోహ్లి(23; 70 బంతుల్లో 2×4) రహానే(18;44 బంతుల్లో 2×4) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరికి టెయిలెండర్లలో అశ్విన్(29; 49 బంతుల్లో 4×4) కొద్దిసేపు పోరాడాడు. అతనికి మిగిలిన ఆటగాళ్లు సహకారం అందించకపోవడంతో 107 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఐదు వికెట్లతో అండర్సన్ భారత్ పతనాన్నిశాసించాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్:
విజయ్‌ (బి) అండర్సన్‌ 0; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 8; పుజారా రనౌట్‌ 1; కోహ్లి (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 23; రహానె (సి) కుక్‌ (బి) అండర్సన్‌ 18; పాండ్య (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 11; దినేశ్‌ కార్తీక్‌ (బి) కరన్‌ 1; అశ్విన్‌ ఎల్బీ (బి) బ్రాడ్‌ 29; కుల్‌దీప్‌ యాదవ్‌ ఎల్బీ (బి) అండర్సన్‌ 0; షమి నాటౌట్‌ 10; ఇషాంత్‌ ఎల్బీ అండర్సన్‌ 0; ఎక్స్‌ట్రాలు 5;
వికెట్ల పతనం: 1-0, 2-10, 3-15, 4-49, 5-61, 6-62, 7-84, 8-96, 9-96;
బౌలింగ్‌: అండర్సన్‌ 13.2-5-20-5; బ్రాడ్‌ 10-2-37-1; వోక్స్‌ 6-2-19-2; కరన్‌ 6-0-26-1

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -