- Advertisement -

ఇదే పవన్ పవర్ అంటే!

- Advertisement -

ప్రస్తుతం  ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ బిజినెస్‌ జోరు మాత్రం అస్సలు తగ్గలేదు. ట్రైలర్, పాటలతో ఈ సినిమాకి సంబంధించి బిజినెస్‌ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో ఈ చిత్రాన్ని ఎగబడి కొనేస్తున్నారట. షేర్‌ గ్యారెంటీలు చెల్లించి రికార్డు రేట్లకి ఎగరేసుకు పోతున్నారట. దీంతో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ని భారీ రేట్లకి కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు లాభాలు లెక్క పెట్టుకుంటున్నారు.

బాహుబలి తర్వాత అంతటి స్థాయిలో బిజినెస్‌ జరిగిన సినిమాకి ఫలితం తేడా అయితే బయ్యర్లు మటాష్‌ అయిపోతారని అనుకున్నారు. కానీ రిలీజ్ కు ముందే బయ్యర్లు సేఫ్‌ అయిపోతున్నారు. మొదటి వారంలోనే ఎంత లేదన్నా అరవై కోట్ల షేర్‌ వస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో యాక్షన్‌ పార్ట్‌, హీరోయిజం బాగా వుంటుందని తేలడంతో సినిమా ఎలాగున్నా మినిమం గ్యారెంటీ అంటూ ట్రేడ్‌ భావిస్తోందట.

వారి స్పందనతో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ నిర్మాతలు ఖుషఅయిపోతున్నారట. కేవలం పవన్‌కళ్యాణ్‌ ఫ్యాక్టర్‌ మీదే ఇన్ని కోట్లు చేతులు మారుతున్నాయనే దాంట్లో అనుమానాలు అక్కర్లేదు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -