Saturday, May 18, 2024
- Advertisement -

ఇంత ప్రచారం అవసరమా?

- Advertisement -

ఏ పని చేసినా.. జనం మెచ్చేలా ఎలా చెప్పుకోవాలో ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినంత మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికీ.. తనకే క్రెడిట్ దక్కేలా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇందుకు తగ్గట్లే ఉంది.

జపాన్ కంపెనీ చేసిన డిజైన్ ను బాబు సర్కార్ ఓకే చేసింది. అక్కడితో ఆగకుండా.. తనకు అనుకూలమైన చానళ్లలో ఆ డిజైన్ ను ప్రచారం చేస్తూ.. ఇదిగో ఇదే అమరావతి అంటూ ఊదరగొట్టింది. రేపో ఎల్లుండో అమరావతి నిర్మాణం కూడా పూర్తి అయిపోతోందన్న భావన కలిగించేలా ప్రయత్నించింది.

టీడీపీ సర్కార్ నడిపించిన ఈ హై డ్రామా.. తెలుగు తమ్ముళ్లకు ఆనందం కలిగిస్తుంటే.. మామూలు జనానికి మాత్రం ఇంత సీన్ అవసరమా అని విసుగు చెందే పరిస్థితి కనిపిస్తోంది. మంచి పని చేస్తే.. ఎలాగూ అందరి నుంచి అభినందనలు వస్తాయి. కానీ.. కనీసం ఇటుక ముక్క కూడా జరగకుండానే ఇలాంటి ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్న సలహాలు.. చంద్రబాబు ప్రభుత్వానికి అందుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -