- Advertisement -

కన్నయ్యను అరెస్ట్ చేయొద్దన్నారట

- Advertisement -

తనకు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండడం.. అదే అనుకూలమైన సిచువేషన్లలో చెలరేగిపోవడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే అని అంతా అనుకుంటూ ఉంటారు. తాజాగా.. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య.. హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా కేసీఆర్ ఆచి తూచి వ్యవహరించారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

ఎలాంటి పరిస్థితుల్లో కూడా కన్నయ్య టూర్ డిస్టబ్ కావొద్దని.. అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే చాన్స్ ఉందని కేసీఆర్ ఇంటర్నల్ గా స్పష్టంగా చెప్పారట. అందుకే.. కన్నయ్య హైదరాబాద్ వచ్చింది మొదలు.. తిరిగి వెళ్లిపోయేవరకూ అంతా బ్యాలెన్స్ డ్ గా ఉండాలని ఆదేశాలు కూడా ఇచ్చారట.

అంతా బానే ఉంది కానీ.. ఓ విద్యార్థి నాయకుడి విషయంలో.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతలా ఆలోచించాలా అని కొందరు అనుమానపడుతున్నారు. అయితే.. ఇలాంటి విషయానికి కూడా ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారు కాబట్టే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.. అని కేసీఆర్ తీరును వెనకేసుకొచ్చే వారు కూడా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -