- Advertisement -

ప‌ది గంట‌ల త‌ర్వాత ప‌ది గంటల తర్వాత సజీవంగా బయటకు ఎలానో తెలుసా..?

- Advertisement -

పొరపాటున కాలుజారి సముద్రంలో పడిపోతే.. ఎవరైనా సరే ఇక అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, అలా పడిన ఓ మహిళ 10 గంటల పాటు సముద్రంలోనే వుండి బతికి బట్టకట్టిందంటే వండరే కదా? బ్రిటన్ కు చెందిన ఓ మహిళ విషయంలో అదే జరిగింది.

క్రొయేషియాకు చెందిన నార్వేజియన్‌ స్టార్ షిప్ లో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తోంది బ్రిటన్ కు చెందిన కేయ్ అనే మహిళ. అయితే, షిప్ అంచున నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతుండగా కాలుజారి నీటిలో పడిపోయిందట. ఆమె పడిపోవడాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు వెంటనే ఓడ కెప్టెన్‌కు సమాచారం అందించారు. చివ‌ర‌కు కోస్ట్ గార్డ్స్ వ‌చ్చి ఆమెను ర‌క్షించారు. ఇన్నిగంట‌లు స‌ముద్రంలో ఉండి ఎలా బ్ర‌తికార‌ని అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె చెప్పిన స‌మాధానాలు చూస్తే షాక్ అవ్వాల‌సిందే.

ఆమె పడిపోయిన ప్రదేశం క్రొయేషియా తీరప్రాంతానికి 60 మైళ్ల దూరంలో ఉంది. వెంటనే వారు నేవీ అధికారులకు తెలియజేశారు. గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ నేవీ, తీరప్రాంత అధికారులు పీసీ-9 విమానంతో గాలింపు చేపట్టి యువతిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. నేవీ అధికారులు రంగంలోకి దిగారు.ఆమెను రక్షించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.

బ్రిటిష్ మహిళ బతకడంపై ఓడ కెప్టెన్ మాట్లాడుతూ.. ఓ మహిళను కాపాడినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మహిళ బతికి బయటపడటం లక్కీ, అద్భుతం అని అంటున్నారు. అంతసేపు సముద్రంలో ఎలా ఉండగలిగారని ప్రశ్నిస్తే యోగా ఫిట్‌నెస్, పాటలు తాను అన్ని గంటలు బతికేందుకు ఉపయోగపడ్డాయని ఆమె చెప్పారు. తాను యోగా చేస్తానని, దీని వల్ల ఫిట్‌గా ఉన్నానని ఆమె చెప్పారు. అలాగే, రాత్రంతా సముద్రంలో ఉంది. సముద్రం చల్లదనం ఫీల్ నుంచి బయటపడేందుకు ఆమె పాటలు పాడారని చెప్పారట. తాను వెనుక వైపు ఉన్న సమయంలో కిందపడ్డానని తెలిపారు. ఆమె స్నేహితులు మాత్రం ఇదంతా మిరకిల్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -