Saturday, May 4, 2024
- Advertisement -

లోకేష్ టెక్నాల‌జీతో స‌చివాలాయాన్ని నిర్మించారా…వైసీపీ

- Advertisement -

విజ‌య‌వాడ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ సచివాలయంలో లీకేజీలు మరోసారి బయటపడ్డాయి. ఎడ తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు మంత్రుల ఛాంబ‌ర్‌లోకి నీరు వ‌చ్చి చేరింది. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస రావు,. దేవినేని ఉమా మహేశ్వర్‌రావు, అమర్నాథ్ రెడ్డి ల ఛాంబర్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. 4,5వ, బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడి కింద పడింది.

స‌చివాల‌యంలో మ‌రో సారి లీకులు బ‌య‌ట‌ప‌డంతో వైసీపీ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు లేటెస్ట్‌ టెక్నాలజీతో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించినట్టు గొప్పలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు వైసీపీ అధికార ప్ర‌తినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ . లేటెస్ట్‌ టెక్నాలజీతో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించినట్టు గొప్పలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

గతంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఛాంబర్‌లో నీళ్లు లీక్‌ అయితే నానా మాటలు అన్నారని.. కానీ ఇప్పుడు మంత్రుల ఛాంబర్లలో అదే పరిస్ధితి నెలకొందన్నారు. సచివాలయాన్ని మంత్రి లోకేశ్‌ టెక్నాలజీతో నిర్మించారని ఎద్దేవా చేశారు. మంత్రులు, అధికారులు సచివాలయంలోకి వెళ్లడానికి భయపడుతున్నారని అన్నారు.

వేల కోట్లు ఖర్చుపెట్టి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన చంద్రబాబు, లోకేశ్‌లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా వరద వస్తే సచివాలయం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -