- Advertisement -

బాలయ్యకు ఫేవరెట్ హీరోయిన్ ఇప్పటికీ ఆమెనే..!

- Advertisement -

త్వరలోనే సెంచరీని పూర్తి చేసుకోబోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. మరి ఇన్ని సినిమాలతో.. దశాబ్దాలుగా పయనాన్ని కొనసాగిస్తున్న ఆయన ఎంతో మంది తో పనిచేసి ఉంటాడు.

ప్రత్యేకించి సినిమాలకు సంబంధించి దర్శకులు, హీరోయిన్లు బాలయ్య కు దగ్గరగా మెలిగి ఉంటారు. వారితో కలిసి పనిచేయడంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి.

మరి ఇలాంటి అనుభవాలను, అనుభూతులను మిగిల్చిన వారిలో నందమూరి నటసింహానికి ఇష్టమైన వారు ఎవరు? బాలయ్యను బాగా ఆకట్టుకొన్న హీరోయిన్ ఎవరు? ఆమె అయితే తన పక్కన బాగా ఉంటుందని బాలయ్య ఎవరి పేరును ప్రస్తావిస్తాడు? అంటే… ఆయన విజయశాంతి పేరు చెబుతారు!

మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించి ప్రస్తుతానికి కాస్త సైలెంట్ అయిన విజయశాంతి పేరును బాలయ్య ప్రస్తావించాడు. తన పక్కన నటించిన భామల్లో విజయశాంతి బెటర్ పెయిర్… బెస్ట్ పెయిర్ అన్నారు బాలయ్య. ఆమెతోపోటా పోటీగాడాన్సులు చేసేవాడిని.. అని  పోటాపోటీగా నటించేవాడిని అని.. బాలయ్య నాటి రోజులను గుర్తు చేసుకొన్నాడు. 

విజయశాంతితో తనది హిట్ పెయిర్ అని బాలయ్య చెప్పుకొచ్చారు. విజయశాంతి తర్వాత రోజా, రమ్యకృష్ణ, సిమ్రాన్, నయనతార వంటి వారు కూడా తన పక్కన బెస్ట్ హీరోయిన్లు అని బాలయ్య చెప్పారు. మరి వీరు అనమాట బాలయ్యను ఆకట్టుకొన్న నటీమణులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -