Friday, May 17, 2024
- Advertisement -

చంద్రబాబు సీఎం కావడానికి కారణం ఆయనేనా..?!

- Advertisement -

చంద్రబాబు నాయుడు ఏపీ కి సీఎం ఎలా అయ్యాడు.. ? అంటే ఒక్కోరు ఒక్కో రీజన్ చెబుతారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీని సాధించి బాబు సీఎం కావడం వెనుక ఆనేక రీజన్లున్నాయని వారు చెబుతారు.

పవన్ కల్యాన్ వల్ల బాబు సీఎం అయ్యాడని కొందరు.. రుణమాఫీ వంటి హామీనే బాబును నిలబెట్టిందని మరికొందరు అంటూ ఉంటారు. మరి మొన్నటి సంగతి పక్కన పెడితే.. మొదటి సారి బాబు ఎలా సీఎం అయ్యాడు? అంటే.. ఇంకా ఎన్నో సమాధానాలు వినిపిస్తాయి.

ఎన్టీఆర్ ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించి బాబు సీఎం అయ్యాడు. 1995లో బాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకొన్నాడని కొందరు అంటారు. మరికొందరేమో.. అలా కాదు.. లక్ష్మి పార్వతి వంటి రాజ్యాంగేతర శక్తిని అణగదొక్కడానికే బాబు ఆ పని చేశాడని బాబు అభిమానులు వాదిస్తారు. ఎలాగైతేనేం.. ప్రత్యక్ష ఎన్నికల జోలికే వెళ్లకుండా బాబు ముఖ్యమంత్రి అయ్యింది నిజం.

మరి ఇదంతా జరిగిపోయే దశాబ్దాలు గడిచిపోయాయి. బాబు పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో తెలంగాణ కు చెందిన తెలుగుదేశం నేత ఉమామాధవరెడ్డి గతాన్ని  ప్రస్తావించారు. బాబు తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టడంలో తన భర్త మాధవరెడ్డిదే కీలక పాత్ర అని ఆమె అన్నారు. బాబుకు మాధవరెడ్డి అండగా నిలబడటంతోనే ఆయన సీఎం కాగలిగారని .. అప్పటి నుంచి తమ కుటుంబం బాబుకు అండగా నిలుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

మరి తను సీఎం కావడం వెనుక మాధవరెడ్డి సహకారం ఉందని ఇప్పుడు బాబు ఒప్పుకొంటారా?! అలాంటిదేమీ లేదంటారా! అసలు ఆనాటి పరిణామాల గురించి బాబు మాట్లాడతారా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -