విశాల్ కెరీరను టర్న్ చేసిని సినిమా ఏదైనా ఉంది అంటే అది పందెం కోడి సినిమానే.ఈ సినిమా విశాల్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది.తాజాగా ఈ సినిమా సీక్వెల్‌తో వస్తున్నాడు విశాల్.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాను, తమిళ, తెలుగు భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ కట్ చేశారు.
దేవాలయం .. జాతర నేపథ్యంలోని సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేసి వదిలారు. లవ్ .. యాక్షన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ విలనీ షేడ్ ప్రధానంగా ఈ టీజర్ కొనసాగింది. “నేనింకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు .. అడ్డుకోవడమే మొదలు పెట్టాను” .. “ఇది పులి .. మేక ఆట కాదు .. పులి – మేక కలిసి ఆడే ఆట” అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది. పందెం కోడికి దర్శకత్వం వహించిన లింగుస్వామి పందెం కోడి-2కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా విశాల్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం.
