రూపాయి క్షీణత, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బకొట్టింది. రోజంతా అస్థిరంగా ట్రేడైన స్టాక్ మార్కెట్లు, చివరిలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఐటీ మినహా మిగిలిన సూచీలన్నీ నష్టాలు చవిచూశాయి.మెరికా డాలరు మారకంతో భారత రూపాయి విలువ రూ. 71.54కు పడిపోవడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది.
డాలర్ మరింత బలపడటంతో, ఐటీ కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 155 పాయింట్లు కోల్పోయి 38,158కి పడిపోయింది. నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 11,520 వద్ద స్థిరపడింది.
చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు, అర్జెంటీనా సంక్షోభం, రూపాయి పతనం వంటి అంశాలు వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయడంతో అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (5.01%), క్వాలిటీ (4.78%), లక్ష్మి విలాస్ బ్యాంక్ (3.08%), ఫీనిక్స్ మిల్స్ (2.83%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (2.72%).
లాప్ లూజర్స్:
ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-8.89%), నెట్ వర్క్ 18 మీడియా (-7.89%), ఎన్సీసీ (-7.82%), ఐనాక్స్ లీజర్ (-7.72%), రిలయన్స్ పవర్ (-7.54%).
