- Advertisement -
అందాల తార ప్రియాంక చోప్రాకు అమెరికా వైట్ హోస్ నుంచి పిలుపు వచ్చింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఆయన సతీమణి మిచెల్ ఒబామాల నుంచి ఈ హీరోయిన్ కు ఆహ్వనం అందింది..
ఈ నెలాఖరున జరిగే కరస్పాండెంట్ విందుకు రమ్మని ప్రియాంక చోప్రాను ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా దంపతులు ఇచ్చే ఆఖరి విందు ఇదే కావడం విశేషం. ఈ విందులో పలువురు హాలివుడ్ నటీనటులు, పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొంటారని వైట్ హోస్ ఓ ప్రకటనలో తెలిపింది.