వర్మసినిమాల్లో హీరోయిన్‌లు అంటే ఒ ప్రత్యేకత..ఒ గుర్తింపు ఉంటుంది. అది ఎందులోనంటే అందాలను ఆరబోసి ప్రేక్షకులను కనువిందు చేయడం. హీరోయిన్స్‌ను బోల్డ్‌గా చూపించడంలో వర్మ స్టైల్‌లే వేరు. తాజాగా రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’. ధనంజయ మరియు ఇర్రా మార్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది.
బోల్డ్ కంటెంట్‌కి వయొలెన్స్ మిక్స్ చేసి వదులుతున్న ఈ మూవీలో కొత్త హీరోయిన్ ఇర్రా మోర్ సొగసులు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. తాజాగా ఈ మూవీని ప్రమోట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసిన ఇర్రా మోర్ ఫోటోలు యువత గుండెల్లో గుబులు రేపేలా ఉన్నాయి.