- Advertisement -

మంత్రి గా నారా లోకేష్ – వారసుడు దాదాపు ఖరారు అయినట్టే !

- Advertisement -

ఏపీ  ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కాబినెట్ లో అడుగు పెడతారు అని మొన్నటి నుంచీ గట్టిగానే వార్తలు వినిపిస్తూ ఒస్తున్నాయి. లోకేష్ విషయం లో మనకి అందుతున్న సమచారం ప్రకారం చంద్రబాబు తీవ్రమైన తర్జన భర్జన పడిన తరవాత మంత్రి వర్గం లో తీసుకునే విషయం లో ఒక నిర్ణయానికి ఒచ్చారు అని అర్ధం అవుతోంది.

అయితే కేంద్ర మంత్రి గా ఆయన్ని కేంద్రానికి పంపాలా లేక రాష్ట్రం లో తన మంత్రి వర్గం లో చోటు ఇవ్వాలా అనేది తేలాల్సి ఉంది. అలాగే లోకేష్ ను మండలికి పంపాలా లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా అన్న ప్రశ్నలు కూడా చంద్రబాబు మదిలో మెదిలాయి.

ఈ విషయంలో బాబు లోకేష్ ను ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం ఓ నియోజకవర్గం కూడా చూసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సోనియాగాంధీ రాహుల్ ను మంత్రి చేయలేదని..దీంతో ఆయనకు పాలనా పరమైన అనుభవం రాలేదన్న విమర్శలు వచ్చాయి. రాహుల్ విషయంలో సోనియా చేసిన తప్పును చంద్రబాబు చేయకూడదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు అన్ని చూపిస్తూ లోకేష్ ని పార్టీ తరఫున కేంద్రం లోకే పంపించాలి అని చూస్తున్నట్టు గా చెబుతున్నారు. జూన్ లో ఇది తధ్యం అంటున్నారు .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -