Thursday, May 23, 2024
- Advertisement -

ఫేస్ బుక్ కొత్త ప్రయోగం

- Advertisement -

ఇన్నాళ్లూ ఫేస్ బుక్ లో ఫేర్ చేసుకోవడం.. కామెంట్లు పెట్టడం.. లైకులు చేయడం మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రం కొత్తగా మరొకటి చేరింది. అదే ఫేస్ బుక్కులో వినడం. అయితే ఇది అందరికి కాదు.. కొందరికే పరిమితం. అందులోనూ అంధులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.

అంధులు ఎవరైనా ఫేస్ బుక్ ఓపెన్ చేయగానే ముందు ఆ ఫొటోలో గురించి వినిపిస్తుంది. ఐదేళ్ల  క్రితం ఫేస్‌బుక్ ఏర్పాటు చేసిన యాక్సెసిబిలిటీ బృందం ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. అదే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’. ఈ సాంకేతక పరిజ్ఞానం సాయంతో పోస్టింగ్‌లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అప్‌లోడ్ అయిన ఫోటోల వివరాలు మాటల రూపంలో వినిపిస్తాయి.

ఇది అంధులకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సోమవారం నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఐఓస్ వినియోగ దారులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్ లో  ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా దీన్ని వాడుకోవచ్చునని కంపెనీ చెబుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -