మనుషుల అక్రమ రవాణా కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. భారీ బందోబస్తు నడుమ జగ్గారెడ్డిని సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.
మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెసు నేత, మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డిని ఈ నెల 11వ, తేదీన పోలీసులు అరెస్టు చేశారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి.. భార్యాపిల్లలుగా పేర్కొంటూ మరో ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకుని వెళ్లారని అభియోగాలున్నాయి. జగ్గారెడ్డి 2004లో తన అధికారిక లెటర్ ప్యాడ్‌పై ప్రాంతీయ పాస్‌పోర్టుఅధికారికి లేఖ రాశారని పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన జగ్గారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న జగ్గారెడ్డిని మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.