యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అరవింద సమేత.దసరాకు విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే విడుదల చేసిన టీజర్,సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పోస్టర్‌పై పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.’అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్ ఫోటోని పోస్ట్ చేస్తూ.. ‘నేనేం అనను.. దిష్టి తగులుతుంది’ అని కామెంట్ పెట్టారు.
తాజాగా ‘పెనివిటి’ అనే మరో పాటను విడుదల చేయనున్నారు. అయితే విడుదలకు ముందే ఈ పాట సోషల్ మీడియాలో అంచనాలను పెంచేస్తుంది.పాటలోని కొన్ని లిరిక్స్‌ని రామజోగయ్య శాస్త్రి అభిమానులతో షేర్ చేసుకున్నారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కనిపించనున్నాడని సమాచారం.ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.