సమాజంలో చిన్నారులకు రక్షణ లేదనుకుంటే ..ఇప్పుడు స్కూల్లలో కూడా వారికి రక్షణ లేకుండా పోతోంది. స్కూల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ కీచకుడిగా మారాడు. విద్యార్థులకు మంచిన బోధించాల్సిన ప్రిన్సిపాల్ దారి తప్పాడు. అభం శుభం తెలియని చిన్నారులను కళ్లల్లో పెట్టుకుని చూడాల్సిన పాఠశాల ప్రిన్సిపల్, క్లర్క్‌లు కామంతో కళ్లు మూసుకుపోయి దుశ్చర్యకు పాల్పడ్డారు.
కామంతో కల్లు మూసుకొని పోయిన ఇద్దరూ ఐదవ తరగతి చదువుతున్న అమ్మాయి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొన్నినెలలుగా నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేశారు. దీన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.
గురువారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రెండు నెలల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. దీనిపై చిన్నారిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సదరు హెడ్మాస్టర్ తో పాటు క్లర్క్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.
