త్రివిక్రమ్ బ్రెయిన్ పాదరసంలా పనిచేసింది. పాత్ర ఏదైనా, స్టేజ్ ఏదైనా రెచ్చిపోయి మరీ బ్రిలియంట్ టాలెంట్ చూపించే ఎన్టీఆర్‌లాంటి నటుడు, స్టార్ చేతిలో ఉంటే ఏం మేజిక్ చెయ్యొచ్చో అది చెయ్యడానికి రెడీ అయిపోయాడు. నందమూరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ సినిమా రిలీజ్‌కి ముందే సూపర్ కిక్ ఇచ్చే ఐడియాతో రెడీ అయిపోయారు ఎన్టీఆర్, త్రివిక్రమ్. పరమ బోరింగ్, రెగ్యులర్ భజన కార్యక్రమాలతో మొనాటనీగా అనిపించే, కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తున్న తెలుగు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ తరహా మారుస్తూ సూపర్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్, త్రివిక్రమ్.
తెలుగు సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్, ఆడియో రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్ లేదా అవార్డ్స్ ఫంక్షన్………..పేరు ఏదైనా కూడా నిర్వహణ మాత్రం పరమ రొటీన్‌గా ఉంటుంది. ప్రోగ్రాం జరిగే తీరు బోరింగ్‌గా ఉంటుంది. అలాంటి బోర్డంని బ్రేక్ చేయాలనే ఐడియాతో ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్, త్రివిక్రమ్. యాంకర్‌తో బండి లాగించే ప్రోగ్రాంలా కాకుండా గంటకు పైగా ప్రోగ్రాంని తమ యాంకరింగ్‌తో రంజింప చేయనున్నారు ఎన్టీఆర్, త్రివిక్రమ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక సినిమా ఫంక్షన్‌లో ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో, డైరెక్టర్ కలిసి ఆ సినిమా ఫంక్షన్‌ని రక్తికట్టించే కార్యక్రమానికి తెరలేపారు. తెలుగు భాషపై త్రివిక్రమ్‌కి ఉన్న పట్టు గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అలాగే ఏ బిగ్ బాస్‌తో సహా ఏ స్టేజ్‌పైన అయినా సరే…………తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు తారక్. ఇప్పుడిక సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో తారక్ ఏ స్థాయి దుమ్ము దులుపుతాడో చూడాలి మరి. ఏది ఏమైనా తారక్, త్రివిక్రమ్‌లు కలిసి చేయబోయే హంగామాతో అరవింద సమేత బజ్, క్రేజ్ ఓ స్థాయికి రీచ్ అవుతుందనడంలో సందేహం లేదు. నందమూరి ఫ్యాన్స్‌కి బంపర్ బొనాంజా ఎంటర్టైన్‌మెంట్ ఖాయం.
