- Advertisement -

కౌశ‌ల్ విష‌యంలో తేజ‌స్వీ ఇంకా మార‌లేదా ..?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నుంది. రెండో సీజ‌న్ మొద‌టి నుంచి వివాదాల‌తోనే సాగుతుంది.కాని ఈ వారం మొత్తం హౌస్‌మెట్స్ అంద‌రు చాలా ప్రశాంతంగా ఉంటు వ‌స్తున్నారు.తాజాగా ఈరోజు ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్‌.షో నుంచి ఎలిమినేట్ అయిన తేజ‌స్వీ,రోల్ రైడా,అమీత్ దీప్తి సునైనాలు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మెట్స్‌కు షాక్ ఇచ్చారు.తేజ‌స్వీ వ‌చ్చి రాగ‌నే త‌న అల్ల‌రితో సంద‌డి చేసింది.నా వంట మీస్ అయ్యారా అంటూ తేజ‌స్వీ త‌నీస్ బుగ్గ‌ల‌ను ప‌ట్టుకుని చాలా ముద్దుగా అడిగడం మ‌నం ఈ ప్రోమోలో చూడ‌వ‌చ్చు.

కంటెస్టెంట్‌లు త‌మ బెడ్స్ ద‌గ్గ‌రికి వెళ్లి ,పాత గుర్త‌ల‌ను నెమ‌ర‌వేసుకున్నారు.నేను చేసింది ఇప్ప‌టికి త‌ప్పు కాదని నేను అనుకుంటున్నాన‌ని తేజ‌స్వీ త‌నీష్‌తో మాట్లాడింది.దీనిని బ‌ట్టి వీరు కౌశ‌ల్ గురించే మాట్లాడుకుంటాన్నార‌ని అర్థం అవుతుంది.దీనికి స‌మాధానంగా మేం గేమ్ ఆడుతుంది కేవ‌లం మాకు ఓట్లు వేసే ప్రేక్ష‌కుల కోస‌మే అని అంతేకాని నీకోస‌మో వేరే వాళ్ల కోస‌మే కాద‌ని తెలిపాడు త‌నీష్‌.ఈ ప్రోమోలో పెద్ద‌గా ఎక్క‌డ కౌశ‌ల్ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.అయితే తేజ‌స్వీ బాత్ రూమ్‌లో ఉన్న గీతాతో నువ్వు ఇంకా ఎలిమినేట్ అవ్వ‌లేదా అని స‌రదాగా ఆట‌ప‌ట్టించిన విధానం ప్రోమోకే హైలెట్‌గా నిలిచింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -