Thursday, May 16, 2024
- Advertisement -

ఇంటెలిజెన్స్, రాజ్యసభ ఎంపితో ముఖ్యనేత చర్చలు……ఎస్కేప్ ప్లాన్ ఎలా?

- Advertisement -

ఆపరేషన్ గరుడ అని, ప్రజాందోళనలు వస్తాయి అని….ఇంకో ఎన్నో చెప్పి భయపెట్టాలని చూసినా ఓటుకు నోటు కేసులో విచారణ సంస్థలు వెనక్కి తగ్గడం లేదు. అరెస్ట్ సమయం రోజు రోజుకూ దగ్గరవుతున్నట్టే ఉంది. టిడిపి ముఖ్యనాయకులే ఈ విషయంపై ధైర్యంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ముఖ్యనేత కూడా ఈ సంకట స్థితిని ఎలా ఎదుర్కోవాలి? అరెస్ట్ తప్పించుకోవడం ఎలా? మొత్తం వ్యవహారాన్ని ఏమార్చి 2019 ఎన్నికల్లో తన గెలుపుకు ఉపయోగపడేలా ఎలా వ్యూహ రచన చేయాలి అనే అంశాలపై ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, న్యాయవ్యవస్థపై అవగాహన ఉన్న ఒక ఎంపితో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నాడు. ఓటుకు నోటు కేసుపై ఈ ఎంపికి పూర్తిస్థాయి అవగాహన ఉంది.

రేవంత్‌రెడ్డితో సహా ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న అందరి ఇళ్ళపై ఐటి దాడులు స్పష్టంగా తేల్చేస్తున్న విషయం ఒక్కటే. అతి త్వరలో ఈ దాడులు టిడిపి ముఖ్యనేత ఇంటి గడపలోకి కూడా రావడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ముందుగానే అరెస్ట్‌కి ప్రిపేర్ అయిపోయాడు. ఆ నేపథ్యంలో ముఖ్యనేత అరెస్ట్ కూడా ఖాయంగానే కనిపిస్తోందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మన దగ్గర నేరం చేసినవాడితో పాటు, చేయించిన వాడిని కూడా తీవ్రంగా శిక్షించాలని చట్టాలు ఉన్నాయి. వైకాపా ఎమ్మెల్యే కిడారికి టిడిపిలో చేరడానికి గానూ ముఖ్యనేతలే 30 కోట్లు ఇచ్చారని మావోయిస్టులు తేల్చేశారని స్వయంగా టిడిపి భజన పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వార్త వచ్చింది. ఒక ఎమ్మెల్యేకు 30 కోట్లు అంటే ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు ఆ ఎమ్మెల్సీతో సహా మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడా కొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయాలని వ్యూహరచన చేశారు. అంటే ఏ స్థాయిలో……..ఎన్ని వందల కోట్లు చేతులు మారి ఉండాలి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ సంస్థలకు స్పష్టమైనా సమాచారం, సాక్ష్యాలు దొరికితే మాత్రం శేష జీవితం అంతా జైలులోనే గడపాల్సిన స్థాయిలో శిక్షలు తప్పవని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. మోడీతో కూడా పూర్తి వ్యతిరేకత తెచ్చుకోవడం, మరోవైపు కేసీఆర్‌ని కూడా శతృవును చేసుకున్న నేపథ్యంలో గతంలో 20 సార్లకు పైగా ఎస్కేప్ అయినట్టుగా ఈ సారి ఎస్కేప్ సాధ్యమా? ఒకవేళ అరెస్ట్, శిక్ష పడే పరిస్థితులే వస్తే చేసిన తప్పు ప్రజలకు తెలియకుండా చేస్తూ………ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారని, కక్ష్యసాధిస్తున్నారని అబద్ధపు ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లను మాయచేసి 2019 ఎన్నికల్లో రాజకీయ లాభం పొందడం ఎలా? అన్న విషయాలే ఇప్పుడు టిడిపిలో హాట్ హాట్‌గా చర్చకు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -