Thursday, May 2, 2024
- Advertisement -

తుదిపోరు… టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న భార‌త్‌..

- Advertisement -

దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియాక‌ప్ ఫైన‌ల్లో భార‌త్ టాస్ గెలిచి ఫిల్డింగ్‌ ఎంచుకుంది. ఆప్ఘ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కీల‌క ఆట‌గాల్లు లేకుండా యువ‌కుల‌కు ప్రాధాన్య‌త ఇచ్చి ప్ర‌యోగాలు చేశారు, సూప‌ర్ 4లో పాక్‌ను ఓడించి బంగ్లా అద్భుతంగా ఫైన‌ల్ చేర‌కుంది. దీంతో భార‌త జ‌ట్టు పూర్థిస్థాయి ఆట‌గాల్ల‌తో బ‌రిలోకి దిగుతోంది.

ఓపెనర్లు రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్ మళ్లీ టీమ్‌లోకి వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో రాణించిన రాహుల్ టీమ్‌లో ఉంటాడని భావించినా.. దినేష్ కార్తీక్‌నే కొనసాగించాలని టీమ్ నిర్ణయించింది. ఇక ఇప్పటికే ఆరుసార్లు ఏషియాకప్ గెలిచిన భారత్.. రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్‌పై కన్నేసింది.

ఆసియా కప్‌ చరిత్రలో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా.. టీమిండియా ఏకంగా 10 సార్లు విజయాల్ని అందుకుంది. 2016 ఆసియా కప్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్‌తో ఢీకొన్న భారత్ జట్టు అలవోక విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

తుది జట్లు
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, దినేశ్‌ కార్తీక్, ధోని, కేదార్‌ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా
బంగ్లాదేశ్‌: మొర్తజా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్‌ ఇస్లామ్‌, ముష్ఫికర్, మొహమ్మద్‌ మిథున్, ఇమ్రుల్‌ కైస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, రూబెల్‌ హుస్సేన్, ముస్తఫిజుర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -