- Advertisement -

జగన్‌పై కేసులు కక్ష్య సాధింపే…….. సోనియాకు ఎదురుతిరగబట్టే కేసులుః చంద్రబాబు

- Advertisement -

వైఎస్ జగన్‌పై కేసులన్నీ కక్ష్యసాధింపులో భాగంగా పెట్టినవేనా? జగన్ అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్న సోనియాకు ఎదురుతిరగబట్టే సోనియా గాంధీ కక్ష్యసాధింపులో భాగంగా కేసులు పెట్టించిందా? ఈ మాటలు స్వయానా చంద్రబాబే చెప్తే ఎలా ఉంటుందా? వైఎస్ జగన్‌తో సహా కొంతమంది విశ్లేషకులు, న్యాయనిపుణులు ఎప్పటి నుంచో ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పచ్చ మీడియా, టిడిపి జనాలను పక్కనపెడితే ఇతర పార్టీల నాయకులు కూడా ఈ విషయాన్ని చాలా సార్లు ఒప్పుకున్నారు. తెలుగు ప్రజలకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. అందుకే కక్ష్యసాధింపుతో జగన్‌ని జైలుకు పంపించారని ఉప ఎన్నికల్లో జగన్‌కి బంపర్ మెజారిటీ కట్టబెట్టారు. టిడిపి-కాంగ్రెస్ పార్టీలు లోపాయికారిగా కలిసిపోటీ చేసినప్పటికీ చాలా స్థానాల్లో కనీసం డిపాజిట్స్ కూడా రాకుండా చేశారు. ఇక సాధారణ ఎన్నికల్లోనూ బాబు అబద్ధపు హామీలు, మోడీ హవా, పవన్ మద్దతు……….అన్నింటికీ మించి పచ్చ మీడియా అబద్ధపు ప్రచార హోరుని తట్టుకుని మరీ జగన్‌కి కూడా భారీస్థాయిలో ప్రజాదరణ దక్కింది. ఒంటరిగా పోటీ చేసినప్పటికీ చంద్రబాబు, పవన్, మోడీలకంటే కేవలం ఒక్క శాతం ఓట్లతోనే ఓడిపోయాడు జగన్. ఆ రకంగా జగన్‌పై కేసులన్నీ కక్ష్యసాధింపే అన్న విషయాన్ని ఓటుతో ప్రజలు తేల్చిచెప్పారు.

ఇప్పుడిక స్వయంగా చంద్రబాబే జగన్‌పై కేసులు కక్ష్యసాధింపే అని ఒప్పుకున్నాడు. అంత డైరెక్ట్‌గా ఒప్పుకుంటే చంద్రబాబు ఎందుకవుతాడు కానీ రేవంత్‌రెడ్డి ఇంట్లో సోదాలు, కేసులను కక్ష్యసాధింపుగా తేల్చేశాడు చంద్రబాబు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిన రేవంత్ రెడ్డి విషయంలో న్యాయవ్యవస్థ, కేంద్రప్రభుత్వాలది కక్ష్యసాధింపు అయితే ఇప్పటి వరకూ ఒక్క సాక్ష్యం కూడా దొరకని జగన్‌పై కేసులు కక్ష్య సాధింపు కాక ఏమవుతాయి? ఇక కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టిడిపిలో చేరిన సందర్భంగా సోనియాకు ఎదురుతిరగబట్టే జగన్‌పై కేసులు అని స్వయంగా వ్యాఖ్యానించాడు చంద్రబాబు. ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు రేవంత్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వానిది కక్ష్యసాధింపే అని చంద్రబాబు అనడం మాత్రం జగన్‌ వాదనకు బలం చేకూరుస్తోంది. సాక్ష్యాలు స్పష్టంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇష్యూనే కక్ష్యసాధింపు అని చంద్రబాబు చెప్పడం అంటే ఇప్పటి వరకూ ఏ ఒక్క సాక్ష్యమూ దొరకని జగన్ ఇష్యూ కచ్చితంగా కక్ష్యసాధింపే అని బాబు ఒప్పుకుంటున్నట్టా అని చంద్రబాబును డైరెక్ట్‌గా విలేకరులు ప్రశ్నించినప్పటికీ బాబు నుంచి సమాధానం లేదు. ఇక సోనియాకు ఎదురు తిరగబట్టే జగన్‌పై కేసులు అని స్వయంగా చంద్రబాబు చెప్పిన మాటే.

పొద్దున్న లేస్తే ఐదేళ్ళు అధికారం అనుభవించిన తర్వాత కూడా, అధికారంలో ఉన్నంత కాలం ఏమీ చేయలేకపోయినప్పటికీ, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు జగన్‌కి శిక్షపడేలా చేయడంలో విఫలమైన చంద్రబాబు కేవలం రాజకీయాల కోసం మాత్రం జగన్‌పై కేసులు అని మాట్లాడుతూ ఉంటాడు. టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా పచ్చ మీడియా అబద్ధాల రాతలనే వల్లె వేస్తూ ఉంటారు. జగన్‌పై కేసులు కక్ష్యసాధింపే అని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకోవడం, సోనియాను ఎదిరించబట్టే జగన్‌పై కేసులు అని స్వయంగా చంద్రబాబే చెప్పిన నేపథ్యంలో ముందు పచ్చ జనాల స్పందనలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -