Tuesday, May 7, 2024
- Advertisement -

చావుల‌ను కూడా వ‌ద‌ల‌ని టీడీపీ..

- Advertisement -

రాష్ట్రంలో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దాన్ని రాజ‌కీయంగా వాడుకోవ‌డంలో దేశంలో టీడీపీలాంటి పార్టీ మ‌రొక‌టి ఉండ‌దు. ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు వ‌చ్చిన ప్ర‌తీ సారి త‌న అనుకూల మీడియాతో ఎదురుదాడి చేయ‌డం ప‌రిపాటి. చివ‌ర‌కు చావుల‌తో కూడా చ‌లికాచుకోవ‌డం ఒక్క టీడీపీకే చెల్లుతుంది.

అర‌కులో ఫిరాయింపు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల‌ను మావోయిస్టులు కాల్చిన చంపిన సంఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. వారిని చంపేముందు మావోయిస్టులు, వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌న తెర‌పైకి రావ‌డంతో అదే ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. పార్టీ మారితే డ‌బ్బులు ఇవ్వ‌డంతోపాటు బాక్సైట్ గ‌నుల‌కు లైసెన్సులు కూడా ఇస్తామ‌ని చెప్పడంతో పార్టీ మారాన‌ని చెప్పిన‌ట్ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అస‌లు విష‌యానికి వ‌స్తే ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి, వారిని ప్రలోభ పెట్టి తన పార్టీలోకి చేర్చుకునే హీన చర్యకే గనుక చంద్రబాబు నాయుడు దిగకపోయుంటే కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగేదికాదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లు పెట్టిన ప్రలోభం వల్లనే కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగిందన్నది బహిరంగ ర‌హ‌స్యం.

ఒకవేళ చంద్రబాబు పెట్టిన ప్రలోభానికి లొంగకపోయుంటే కిడారికి కోట్ల రూపాయలు వచ్చేవి కావేమో కానీ.. అంతకు మించి విలువైన ప్రాణాలు ఇలా నక్సల్స్ చేతిలో పోయేవి కావని గిరిజన వర్గాలు కూడా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఇది ఎక్క‌డ పార్టీకీ ఇబ్బందులు గురి చేస్తాయోన‌ని ఎదురుదాడి ప్రారంభించింది టీడీపీ.

కిడారి హత్యను తెలుగుదేశం రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టింది. ఆ హత్యను వైసీపీనే చేయించిందని.. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరినందుకు కిడారిని వైసీపీ హత్య చేయించిందంటూ టీడీపీ నేతలు కొత్త వాదన మొదలుపెట్టారు. ఈ విధంగా కిడారి హత్యను వైసీపీపై విమర్శలకు వాడుకోవ‌డం లాంటి సిగ్గుచేటు ఇంకొక‌టి ఉండ‌దు.

కిడారి హత్యతో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నాలను చేస్తోంది. టీడీపీ పార్టీ ఈ విధంగా చలికాచుకొంటూ తన తీరును మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేస్తోంది. కిడారి హత్య విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ హత్యాకాండలో నక్సల్స్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా టీడీపీ అనుకూల మీడియా కూడా చెబుతోంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హ‌త్య‌ల‌ను వైసీపీకీ అంట‌గ‌ట్ట‌డం చూస్తే ఇంత‌కంటే దౌర్భాగ్యం ఇంకొక‌టి ఉండ‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -