Thursday, May 8, 2025
- Advertisement -

హీరో ,హీరోయిన్ లేకుండానే సినిమాను మొద‌లెట్టేశారుగా..!

- Advertisement -

నిన్ను కోరి సినిమాతో తాను ఒక విభిన్న ద‌ర్శ‌కుడిని అని నిరుపించుకున్నాడు శివ నిర్వాణ. ఈ సినిమా తరువాత మ‌నోడి సంవ‌త్సరం పైగా క‌ష్ట‌ప‌డి ఓ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. సమంత , చైతుల‌కు త‌న క‌థ‌ను వినిపించి సినిమాను ఓకే చేయించాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఆయన, సమంత .. చైతూలకి సెట్ అయ్యే ఒక కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడు.

పెళ్లి త‌రువాత స‌మంత‌,నాగ‌చైత‌న్య‌లు క‌లిసి న‌టించ‌డంతో సినిమాపై అంద‌రికి ఆస‌క్తి నెల‌కొంది. ప్రస్తుతం స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు స్పెయిన్ లో వున్నారు. అయితే వీరు లేకుండానే సినిమా షూటింగ్ మొద‌లు పెట్టారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. స‌మంత‌, నాగ‌చైత‌న్య కాంబినేషన్ సీన్స్ కాకుండా వేరే ఆర్టిస్టులతో చకచకా షూటింగు కానిచ్చేస్తున్నాడట. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్‌లో స‌మంత‌,నాగ‌చైత‌న్య పాల్గొంటారని తెలుస్తుంది. ఈ సినిమాకు ‘మజిలీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -