ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బ‌హుమ‌తి….

కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాల రూపకల్పన దిశగా.. లేజర్ ఫిజిక్స్‌పై పరిశోధనలు చేసిన ముగ్గురికి భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. 2018- నోబెల్ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.

అమెరికాకు చెందిన ఆర్థర్ అష్కిన్‌, ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్ మౌరౌ, కెనడాకు చెందిన డొన్నా స్ట్రిక్‌ల్యాండ్‌లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరికి తొమ్మిది మిలియన్ల స్వీడిష్ క్రొనార్ (1.01 మిలియన్ డాలర్లకు పైగా) ప్రైజ్ మనీగా దక్కనుంది. సగం మొత్తాన్ని అష్కిన్‌కు ఇవ్వనుండగా.. మిగతా సగాన్ని ఇద్దరు పరిశోధకులు పంచుకోనున్నారు.

వైరస్ కణాలను కనుగొనే ఆప్టికల్ ట్వీజర్స్ ను ఆష్కిన్ కనుగొన్నారు. మౌరా, స్ట్రిక్లాండ్ కనుగొనిన టెక్నిక్ ను కంటి శస్త్ర చికిత్సకు ఉపయోగిస్తున్నారు. కాగా, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకుంటున్న మూడో మహిళగా డొన్నా స్ట్రిక్లాండ్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా, రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను రేపు ప్రకటించనున్నారు. ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించడం లేదని జ్యూరీ ప్రకటించింది. 1949 తర్వాత మళ్లీ ఇప్పుడే సాహిత్యంలో నోబెల్ ఇవ్వడం లేదని చెప్పింది.