Tuesday, April 30, 2024
- Advertisement -

అరవింద సమేత ట్రైలర్…….. త్రివిక్రమ్ మార్క్ ఫన్, ఫిలాసఫీ అండ్ ఎమోషన్

- Advertisement -

సంవత్సరాలుగా ఎన్టీఆర్ కోరుకున్న సినిమా…….నందమూరి అభిమానుల అంచనాలు ఆకాశమే హద్దు అనే స్థాయిలో ఉన్న సినిమా……2018 అంతా కూడా ఒక స్టార్ హీరో బాక్స్ ఆఫీస్ సునామీ లేక డల్ అయిన తెలుగు సినిమా మార్కెట్ మొత్తం ఎన్నో ఆశలతో చూస్తున్న సినిమా అరవింద సమేత. థమన్ మ్యూజిక్ ఎలా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ ప్రతిభ, ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ కలిసి సినిమాను నెక్ట్స్ లెవెల్‌లో నిలబెడతాయని సినిమా లవర్స్ నమ్ముతున్నారు. ఈ రెండు విషయాలు తేలేది సినిమా ట్రైలర్‌తోనే.

తాజాగా ఎడిటింగ్ టేబుల్‌పై నుంచి వచ్చిన అరవింద సమేత ట్రైలర్ ఎక్స్‌‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అంచనాలకు తగ్గ రేంజ్‌లోనే ఉంది. సినిమా ట్రైలర్ అంతా కూడా త్రివిక్రమ్ మార్క్ కామెడీ, ఎమోషనల్ కంటెంట్‌తో పాటు సూపర్బ్ అనే రేంజ్‌ ఫిలాసఫీతో ఉండబోతోంది. కామెడీ విషయంలో సినిమాపై ఏ స్థాయి అంచనాలు పెట్టుకోవచ్చో సునీల్ సీన్‌తో ప్రూవ్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇక మాస్ సినిమాల్లో ఇప్పటి వరకూ చూడని స్థాయి యాక్షన్ ఎపిసోడ్ బిట్ ఒకటి ట్రైలర్‌కే హైలైట్ అనే స్థాయిలో ఉండనుంది. అన్నింటికీ మించి లవర్ బాయ్‌గా సాఫ్ట్ యాక్టింగ్, యాక్షన్ హీరోగా ఫైట్స్‌తో పాటు ఎమోషనల్ బిట్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ హై రేంజ్‌లో ఉండబోతోంది.

ఇక త్రివిక్రమ్ మార్క్ ఫిలాసఫికల్ డైలాగ్ ఒకటి మీడియా హెడ్‌లైన్స్‌గా మారబోయే స్థాయిలో ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకూ బజ్ అనుకున్న స్థాయిలో లేని అరవింద సమేత ట్రైలర్ దెబ్బకు పీక్స్‌కి వెళ్ళే స్థాయిలో ట్రైలర్‌లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రతిభ ఉంది. ఇప్పుడు ఈ విషయమే సినిమా యూనిట్‌తో పాటు ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లకు ఫుల్ ఎనర్జీ ఇస్తోందని సినిమా యూనిట్ జనాలు ఆనందంగా చెప్తూ ఉండడం ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -