- Advertisement -

పవనిజం కాదు పవన్ అహం

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విరాళాలు స్వీకరించడమే కాకుండా కాసులున్న వాళ్లకే పార్టీ పదవులు ఇస్తున్నారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము జనసేన కోసం ఎంతో కష్టపడ్డామని కానీ తమకు కన్నీళ్లే మిగులుతున్నాయని బాధ పడుతున్నారు. జిల్లా పర్యటనల్లో కనీసం పవన్ ను కలుసుకునే అవకాశం కూడా తమకు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందని, వాళ్లు చెప్పినట్లే వాళ్లు సూచించినట్లే జనసేన పదవులు హోదాలు లభిస్తున్నాయని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ నిజమైన అభిమానులు మాత్రం పార్టీ జెండా పట్టుకుని, పవన్ పుట్టినరోజులకు, సినిమా విడుదలప్పుడు అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ పార్టీ జనంలోకి బలంగా తీసుకెళ్లాతమని చెబుతున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నిజమైన అభిమానులకు అన్యాయం జరుగుతోందని పవన్ ఫ్యాన్సు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో గుర్తింపు లేకుండా తమకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దిలీప్ సుంకర కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానేనని గుర్తు చేసుకుంటున్నారు. పవన్ కు జనసేనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, విమర్శించినా, నోరు జారినా దిలీప్ సుంకర తీవ్రంగా స్పందించి సమాధానం చెప్పేవారని గుర్తు చేస్తున్నారు. పవన్, జనసేన పై ఎవరు అటాక్ చేసినా దిలీప్ సుంకర తనపై దాడి చేసినట్లే భావించి తిరిగి అటాక్ చేసేవారని పవన్ అభిమానులు కొనియాడుతున్నారు. అటువంటి దిలీప్ సుంకరకు అండగా నిలవాల్సిన పార్టీ, పార్టీ అధ్యక్షుడు కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు.

పైగా దిలీప్ సుంకరను అవమానించి పార్టీ నుంచి గెంటేశారని, నిజమైన అభిమానికి జనసేనలో దక్కిన గౌరవం ఇదేనా అని గుర్తు చేస్తూ పవన్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడు దిలీప్ సుంకరకు పట్టిన గతే ఇప్పుడు తమకు పడుతోందని ఆవేదనతో వాళ్లు పోస్టులు పెడుతున్నారు. పవన్ కోసం ఎంతో కష్టపడిన తమను కాదని జిల్లాల్లో ఎవరెవరికో టికెట్ల హామీలు ఇస్తున్నారని, పార్టీ పదవులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జనసేన తరఫున అధికారిక ప్రకటనలు చేస్తున్న వాళ్లు అసలు పవన్ అభిమానులుగా ఏం చేశారో ఆధారాలు చూపాలని నిలదీస్తున్నారు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు రాజకీయ పార్టీ పెట్టగానే ఎవరెవరో వాలిపోతూ మొదట నుంచీ ఉంటున్న అసలు సిసలు కార్యకర్తలు, అభిమానులను అవమానిస్తున్నారని జనసేన నిరాదరణకు గురైన వాళ్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వీరి నిరసన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ ఎవరైతే పవన్ కు అండగా నిలిచి, బలంగా ఏర్పడ్డారో వాళ్లే ఇప్పుడు అతడి తీరుతో పార్టీ వ్యవహారశైలితో క్రమంగా దూరమవుతున్నారు. జనసేనను నమ్ముకునే బదులు టీడీపీ, వైఎస్ఆర్ సీపీని నమ్ముకుంటే అంతో ఇంతో గుర్తింపు గౌరవం, చిన్నవో పెద్దవో పదవులు కూడా వచ్చే అవకాశముందని అటువైపు చూస్తున్నారు. లేదంటే దిలీప్ సుంకరకు పట్టిన గతే తమకు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -